Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంగ్విన్ సినిమా సూపర్.. కీర్తిని కొనియాడిన రష్మిక.. సైరన్ సీక్రెట్ ఏంటంటే?

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (14:41 IST)
అగ్ర హీరోయిన్ కీర్తి సురేష్‌పై గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందన ప్రశంసల జల్లు కురిపించింది. సస్ప్‌న్స్‌ థ్రిల్లర్‌గా, కీర్తి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'పెంగ్వీన్‌' అమెజాన్‌ ప్రైమ్‌‌లో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. మంగళవారం ఈ చిత్రాన్ని వీక్షించిన రష్మిక చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. 
 
'పెంగ్వీన్‌ సినిమా చూశాను. కీర్తీ అందులో నీ నటన మర్చిపోలేకపోతున్నా. ఎప్పటిలానే ఈ చిత్రంలోనూ అద్భుతంగా నటించావు. ఆపదలో ఉన్న ఓ కుటుంబాన్ని సైరన్‌ రక్షించడం చాలా బాగుంది. దర్శకుడు ఈశ్వర్‌, నిర్మాత కార్తిక్‌ సుబ్బరాజుకు అభినందనలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. కాగా రష్మిక మందన ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పలో నటిస్తోంది. తమిళంలో సుల్తాన్ అనే చిత్రంలో కనిపిస్తోంది. ఇందులో కార్తీ హీరోగా నటిస్తున్నాడు. 
keerti suresh
 
అలాగే ఈ సినిమా గురించి ఆ చిత్ర దర్శకుడు ఈశ్వర్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సైరన్‌(పెంపుడు కుక్క) పాత్ర బాగుంటుంది. అ కుక్క కీర్తీని రక్షిస్తూ ఉంటుంది. 'సైరన్‌ పాత్ర కోసం కుక్క కావాలని చాలా చోట్ల వెతికాను కానీ దొరకలేదు. చేసేదేమి లేక నా పెంపుడు కుక్క మ్యాడీని తీసుకెళ్లి కొన్ని సీన్లు చేయించాను. చాలా బాగా చేసింది. అందుకే మ్యాడీనే తీసుకున్నాను' అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments