Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారెడుమిల్లిలో రవితేజ- రామారావు ఆన్ డ్యూటీ

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (16:15 IST)
Raviteja-diyanka
రవితేజ న‌టిస్తున్న `రామారావు ఆన్ డ్యూటీ` సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఫైనల్ షెడ్యూల్  కోసం చిత్రయూనిట్ మారెడుమిల్లి అటవీ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అక్కడ షూటింగ్ పూర్తి చేసిన తరువాత విదేశాల్లో పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుప‌నున్నారు. 
 
దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీల‌క‌పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మ‌రికొంత మంది ముఖ్య న‌టీన‌టులు యాక్ట్ చేస్తున్నారు. స్యామ్‌ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌. 
 
ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్  పోస్టర్‌కు అద్బుతమైన స్పందన వచ్చింది. ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన తరువాత ప్రమోషన్స్ వేగ‌వంతం చేయ‌నున్నారు. 
 
నటీనటులు : రవితేజ, దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, సార్పట్టా జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తణికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధుసూదన్ రావు, సురేఖా వాణి తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments