Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ రామారావు ఆన్‌ డ్యూటీ,లోరాజీషా విజయన్‌

Webdunia
సోమవారం, 19 జులై 2021 (16:20 IST)
Rajisha-divyamsa
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. రవితేజ కెరీర్‌లో 68వ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా శరత్‌ మండవ దర్శకునిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్‌ ప్రభుత్వఅధికారిగా కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి మరింత పెరిగడంతో పాటుగా అంచనాలు కూడా పెరిగాయి. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రంలో ఒక్క రామారావుగా ఒక్క రవితేజ క్యారెక్టరే కాదు ఈ సినిమాలోని ప్రతిపాత్రకు ప్రాముఖ్యం ఉంది.
 
కథానుగుణంగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంది. ‘మజలీ’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న దివ్యాంశ కౌశిక్‌ ఇప్పటికే ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమాలోని మరో ప్రధానమైన హీరోయిన్‌ పాత్రకు మలయాళ నటి రాజీషా విజయన్‌ను చిత్రబృందం ఎంపిక చేసుకుంది. రాజీషకు తెలుగులో తొలి చిత్రం కావడం విశేషం.
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. కొన్ని రోజులుగా రవితేజ, దివ్యాంశ, రాజీషలపై సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరణ జరుగుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ డిఫరెంట్‌ థ్రిల్లర్‌కు ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు అసోసియేటై ఉన్నారు.
నటీనటులు: రవితేజ, రాజీష విజయన్, దివ్యాంశా కౌశిక్, నాసిర్, సీనియర్‌ నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్‌ రామకృష్ణ, ‘ఈ రోజుల్లో’ ఫేమ్‌ శ్రీ, మధుసూధన్‌ రావు, సురేఖ వాణి తదితరులు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సత్యన్‌ సూర్యన్‌ ఐఎస్‌సీ ఛాయాగ్రాహకులు. ప్రవీణ్‌ కేఎల్‌ ఈ చిత్రానికి ఎడిటర్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్ - దివాళా తీయక తప్పదా?

Kolar farmers: పాకిస్థాన్‌కు టమోటా ఎగుమతి నిలిపివేసిన వ్యాపారులు

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం - తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

ఢిల్లీలో అకాల వర్షాలు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!!

పహల్గామ్ దాడికి బైసరన్ లోయలో 48 గంటలు గడిపిన టెర్రరిస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments