Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

వరుణ్
బుధవారం, 26 జూన్ 2024 (08:39 IST)
సినీ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ శాపనార్థాలు పెట్టారు. తనను, తన పిల్లలు ఆద్య, అకీరా నందన్‌లను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో చేస్తున్న కామెంట్స్, ట్రోల్స్‌, మీమ్స్‌పై ఆమె మండిపడ్డారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని ఆమె శాపనార్థాలు పెట్టారు. అయినప్పటికీ వ్యంగమైన పోస్ట్‌లు ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇటీవలే భార్య అన్నా లెజినోవాతో అకీరా నందన్, ఆద్యలతో కలిసి పవన్ కళ్యాణ్ ఫొటో దిగారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పైగా, ఈ ఫోటో ఎంతూ చూడముచ్చటగా ఉంది. ఇప్పుడు సదరు ఫొటోపై కూడా కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ వేశారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని రేణూ దేశాయ్ మండిపడ్డారు. 
 
"మనుషులు ఇంత దారుణంగా తయారవడం సిగ్గుచేటు అంటూ ఇన్‍స్టాగ్రామ్‍‌లో రేణు పోస్ట్ పెట్టారు. తన గురించి ఇష్టమొచ్చినట్టుగా రాసిన కామెంట్లు, మీమ్స్ చూసి తన కూతురు ఆద్య తీవ్రంగా ఏడ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేను వారి ఫొటోను ఎలా క్రాప్ చేస్తానో.. ఎలా పోస్ట్ చేస్తానో అంటూ.. మీమ్స్ వేసిన‌ వారందరికీ కూడా ఒక కుటుంబం ఉంటుందని గుర్తుంచుకోండి. ఆద్య నన్ను ఎగతాళి చేయడాన్ని చూసి తీవ్రంగా ఏడ్చింది. సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసే వారంతా ఒక్కసారి మీ ఇళ్లలోనూ తల్లులు, అక్కాచెల్లెళ్లు ఉన్నారని గుర్తుంచుకోండి. 
 
మాపై అభ్యంతరకరంగా మీమ్స్, జోక్స్ వేసున్న వారికి ఈ తల్లి శాపం తగులుతుంది. నా బిడ్డ ఈరోజు అనుభవించిన బాధ, కార్చిన కన్నీరుతో మీకు చెడు కర్మ ఖచ్చితంగా తగులుతుందని గుర్తుంచుకోండి. పోలెనా, మార్క్ కూడా ఈ మీమ్స్, కఠినమైన కామెంట్లతో ప్రభావితులవుతారు. మీమ్ పేజ్ అడ్మిన్‌లకు ఈ తల్లి శాపం తగులుతుంది. నేను దీన్ని పోస్ట్ చేసే ముందు 100సార్లు ఆలోచించాను. కానీ నా కూతురు అనుభవించిన బాధను వ్యక్తం చేసేందుకు చెప్పాల్సి వచ్చింది' అని రేణు దేశాయ్ తన ఇన్‍స్టా  పోస్ట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments