Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ జానీ సినిమాను రీమేక్ చేస్తా.. ఫ్లాప్ కావడానికి అదే కారణం?: రేణూదేశాయ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమాల్లో వేటిని రీమేక్ చేయాలనుకుంటున్నారు.. అనే ప్రశ్నకు రేణూదేశాయ్ స్పందించింది. వెంటనే 'జానీ' అని చెప్పేసింది రేణూ దేశాయ్. నిజానికి పవన్‌ కెరీర్‌లో అత్యంత భారీ డిజ

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (12:02 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమాల్లో వేటిని రీమేక్ చేయాలనుకుంటున్నారు.. అనే ప్రశ్నకు రేణూదేశాయ్ స్పందించింది. వెంటనే 'జానీ' అని చెప్పేసింది రేణూ దేశాయ్. నిజానికి పవన్‌ కెరీర్‌లో అత్యంత భారీ డిజాస్టర్‌గా నిలిచింది 'జానీ' సినిమా. ఆ సినిమాకు పవన్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఒరిజినల్‌ కథకు వాణిజ్య హంగులు జోడించడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని రేణూ దేశాయ్ వెల్లడించింది 
 
పవన్‌కల్యాణ్‌ సహచరిగా, అసిస్టెంట్‌ డైరెక్ట్‌ర్‌గా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా, సాంగ్‌ ఎడిటర్‌గా కొనసాగిన రేణూదేశాయ్.. పవన్‌తో విడిపోయిన తర్వాత కూడా 'ఇష్క్‌ వాలా లవ్‌' అనే మరాఠీ సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ నేపథ్యంలో పవన్ కెరీర్‌లో జానీ సినిమా ఫ్లాప్ కావడానికి కారణం ఏమిటంటే? ఒరిజినల్‌ కథ ప్రకారం ఆ సినిమా క్లైమాక్స్‌లో హీరో పాత్ర చనిపోవాలట. కానీ, కమర్షియల్‌ పర్పస్‌ కోసం కథ మార్చేశారని రేణూదేశాయ్ తెలిపింది. కథలో లేని చాలా మార్పులు చేశారని.. ఒరిజినల్ కథనే తెరకెక్కించి వుంటే సినిమా సక్సెస్ అయ్యేదేమోనని రేణుదేశాయ్ అభిప్రాయపడింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments