Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైరెక్టర్ నుంచి పోలీసులకు వాడుకున్నారు : నటి రేవతి సంపత్

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (16:45 IST)
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిపై ఇటీవలి కాలంలో చాలా మంది నటీమణులు బహిరంగంగానే రోడ్డెక్కుతున్నారు. తాజాగా మలయాళ నటి రేవతి సంపత్ సంచలన ఆరోపణలు చేశారు. తనను డైరక్టర్ల నుంచి పోలీస్ అధికారుల వరకు లైంగికంగా వాడుకున్నారనీ, ఆ దుర్మార్గులు జాబితా ఇదేనంటూ ఆమె శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
తనను మొత్తం 14 మంది పేర్లను ఫొటోలతో సహా ఫేస్‌బుక్‌ వేదికగా బయటపెట్టారు. ఇందులో పాపులర్‌ ఆర్టిస్ట్‌ సిద్ధిక్‌, దర్శకుడు రాజేశ్‌ టచ్‌రివర్‌, ఓ డాక్టర్‌, సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ కూడా ఉన్నారని వెల్లడించింది. 'ఈ మోసగాళ్ల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. సినిమాల్లో పనిచేసే మహిళలకు ఈ కష్టాలు తప్పవు. అలాగని ఈ పోరాటంలో నేను ఓ అడుగు కూడా వెనక్కి వేయను' అని రేవతి కామెంట్స్ చేశారు. ఆమె పోరాటం వెనుక తన స్నేహితురాలు ఉందని తెలుస్తోంది. 
 
తనను వేధించిన వారు వీరేనంటూ ఆమె ఓ జాబితాను వెల్లడించారు. రాజేశ్‌ టచ్‌రివర్‌ (దర్శకుడు), , సిద్ధిక్‌ (నటుడు), ఆషికి మహి(ఫొటోగ్రాఫర్‌), సిజ్జు (నటుడు), అభిల్‌ దేవ్‌ (కేరళ ఫ్యాషన్‌ లీగ్‌ ఫౌండర్‌), అజయ్‌ ప్రభాకర్‌ (డాక్టర్‌), ఎంఎస్‌ పదూష్‌ (అబ్యూసర్‌), సౌరబ్‌ కృష్ణన్‌ (సైబర్‌ బల్లీ), నందు అశోకన్‌ (డివైఎఫ్‌ఐ కమిటీ మెంబర్‌), మాక్స్‌వెల్‌ జోస్‌ (షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌), షానుబ్‌ కరావత్‌ (యాడ్‌ డైరెక్టర్‌), రాగేంద్‌ పై (క్యాస్టింగ్‌ డైరెక్టర్‌), సరున్‌ లియో (ఈఎస్‌ఎఎఫ్‌ బ్యాంక్‌ ఏజెంట్‌), బిను (సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ పొన్‌తూరా స్టేషన్‌, తిరువనంతపురం) ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం