Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డి దర్శకుడిని చంపేయాలని ఉంది.. వర్మ.. ఎందుకు?

తెలుగు సినీపరిశ్రమలో అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. విజయ్ దేవరకొండకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా దర్శకుడు సందీప్ రెడ్డిని తెలుగు సినీపరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసింది. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా అంటూ చరిత్ర సృష్టిం

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (14:40 IST)
తెలుగు సినీపరిశ్రమలో అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. విజయ్ దేవరకొండకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా దర్శకుడు సందీప్ రెడ్డిని తెలుగు సినీపరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసింది. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా అంటూ చరిత్ర సృష్టించారు సందీప్ రెడ్డి. ఇప్పటికీ ఆ సినిమాను తలుచుకుని చాలామంది డైరెక్టర్లు బాధపడిపోతుంటారు. అందులోను హీరో శర్వానంద్ అయితే మరీ బాధపడిపోతున్న విషయం తెలిసిందే. 
 
ఈ సినిమాలో మొదటగా శర్వానంద్‌కు అవకాశమిస్తే అతను వద్దని తప్పుకున్నాడు. నిర్మాత, డైరెక్టర్ ఒకరే అయితే ఒత్తిడి పెరుగుతుంది. సినిమా సరిగ్గా చేయలేరు. ఆ సినిమా ఫెయిలయిపోతుంది. నేను అలాంటి సినిమాలు చేయలేనని చెప్పేశాడు.
 
ఇంకేముంది విజయ్ దేవరకొండను సెలక్ట్ చేసి ఆ సినిమాను పూర్తిచేసి సూపర్‌డూపర్ హిట్‌ను సాధించారు సందీప్ రెడ్డి. గత కొన్నిరోజుల ముందు సందీప్ రెడ్డిని ఆయన స్టూడియోలో కలిశారు రాంగోపాల్ వర్మ. సందీప్ ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్ళారు. సినిమా బాగా చేశావు సందీప్.. నిన్ను చూస్తే అసూయ కలుగుతోంది.. చంపేద్దామన్న కోపం కూడా ఉంది అంటూ నవ్వుతూ చెప్పాడట రాంగోపాల్ వర్మ. దీంతో సందీప్ రెడ్డితో పాటు మిగిలిన వారందరూ పగలబడి నవ్వుకున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments