Webdunia - Bharat's app for daily news and videos

Install App

డార్లింగ్.. సాహో ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ప్రభాస్ ట్వీట్ చేశాడు.. (ఫోటో)

జక్కన్న బాహుబ‌లితో ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు ప్ర‌భాస్. ప్ర‌స్తుతం సాహో షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు ప్ర‌భాస్. ప్రభాస్‌కు నేడు (23 అక్టోబర్) పుట్టినరోజు. డార్లింగ్ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2017 (10:15 IST)
జక్కన్న బాహుబ‌లితో ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు ప్ర‌భాస్. ప్ర‌స్తుతం సాహో షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు ప్ర‌భాస్. ప్రభాస్‌కు నేడు (23 అక్టోబర్) పుట్టినరోజు. డార్లింగ్ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియాలో సినీజనులతో పాటు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే సాహోకి సంబంధించిన టీజ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో ఆ టీజ‌ర్లో తెలిసిపోయింది.
 
ఈ నేపథ్యంలో సాహోలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎలా వుంటుందని ఎదురుచూసిన అభిమానులకు శుభవార్త. ఎందుకంటే.. యంగ్ రెబల్ స్టార్ తాజా చిత్రం 'సాహో' ఫస్ట్ లుక్ విడుదలైంది. మంచు కురుస్తున్న రాత్రి వేళ నల్లటి కోటు ధరించి, ముఖం సగం మాత్రమే కనిపించేలా ముసుగు వేసుకుని, ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్న ప్రభాస్ పోస్టర్‌ను సినీ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. 
 
సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ సందర్భంగా ప్రభాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి థ్యాంక్స్ చెపుతూ ట్వీట్ చేశాడు. సాహో ఫస్ట్ లుక్‌ను ప్రభాస్ ఫ్యాన్స్ కోసం పోస్టు చేశాడు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments