Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ కౌగిలిలో శ్రద్ధా కపూర్.. పోస్టర్ అదుర్స్

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (11:39 IST)
బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్, శ్ర‌ద్ధా క‌పూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ట్రైలర్, టీజర్, పోస్టర్లు అప్పుడప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్ర సీమల్లోను భారీ అంచనాలున్న నేపథ్యంలో.. సినిమా ప్రమోషన్‌లో బాగంగా చిత్ర యూనిట్ మరో కొత్త పోస్టర్ విడుదల చేసింది. 
 
ఈ కొత్త పోస్టర్‌లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ సూపర్ రొమాంటిక్ ‌లుక్‌లో అదరగొట్టారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌ ఒకరిని ఒకరు ప్రేమగా కౌగిలించుకుని అదరగొట్టారు. ఈ పోస్టర్‌ను ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ద్వారా షేర్‌ చేశారు. 
 
ఆయన తన పోస్ట్‌లో  ‘హాయ్‌ డార్లింగ్స్‌. ''సాహో" రెండో పాట త్వరలో విడుదల కాబోతోంది'' అని రాస్తూ.. ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ సూపర్ రోమాంటిక్‌గా ఉండడంతో ఫ్యాన్స్‌ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు గ్రాఫిక్స్ పనుల కారణంగా ఈ సినిమాను ఆగస్టు 30న విడుదల చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments