Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాహో''లో రిస్కీ ఫైట్స్.. అమెరికాకు వెళ్లిన డార్లింగ్.. ఎందుకు?

బాహుబలి సినిమాకు తర్వాత ''సాహో''లో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ ఫిట్‌నెస్‌పై కసరత్తులు చేస్తున్నాడు. ఇందుకోసం అమెరికాకు కూడా వెళ్లాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కప

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (17:20 IST)
బాహుబలి సినిమాకు తర్వాత ''సాహో''లో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ ఫిట్‌నెస్‌పై కసరత్తులు చేస్తున్నాడు. ఇందుకోసం అమెరికాకు కూడా వెళ్లాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సాహో కోసం రిస్కీ ఫైట్స్ చేయాల్సి వుంది. ఇందుకోసం ప్రభాస్ అమెరికాకు వెళ్లాడు. 'బాహుబలి' సినిమా సమయంలో ప్రభాస్ భుజానికి అమెరికాలో శస్త్ర చికిత్స జరిగింది. 
 
మళ్లీ ఫిట్‌నెస్ కోసం కసరత్తులు చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై సంప్రదింపులు జరిపేందుకు ప్రభాస్ అమెరికా వెళ్లినట్లు తెలిసింది. డాక్టర్ల సూచనలు తీసుకుని తిరిగొచ్చాక ప్రభాస్ దుబాయ్‌లో జరిగే ''సాహో'' సినిమా తదుపరి షెడ్యూల్‌లో పాల్గొంటాడని సమాచారం. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బేనర్‌పై సాహో నిర్మితమవుతుంది. 
 
మరోవైపు ప్రముఖ మ్యాగజైన్ జిక్యూ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.. మూడేళ్ళ క్రితమే ఓ హిందీ సినిమాని ఓకే చేశానని చెప్పారు. సాహో తర్వాత తాను చేయబోవు చిత్రం ఇదేనని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇది ప్రేమ కథా నేపథ్యంలో ఉంటుందని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments