Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిగా వంద మార్కులు కొట్టేసానంటున్న సాయిపల్లవి

సాయిపల్లవి ఏంటి? తల్లిగా వందమార్కులు కొట్టేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇదంతా సినిమాలో లేండి.. నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న "కణం" సినిమాలో సాయిపల్లవి తల్లి పాత్రను పోషిస్తోంది.

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (13:22 IST)
సాయిపల్లవి ఏంటి? తల్లిగా వందమార్కులు కొట్టేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇదంతా సినిమాలో లేండి.. నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న "కణం" సినిమాలో సాయిపల్లవి తల్లి పాత్రను పోషిస్తోంది. తల్లి అంటే నాగశౌర్యకు భార్యగా, వెరోనికా అనే చిన్నమ్మాయికి తల్లిగా నటిస్తోంది. తెలుగులో మూడో సినిమాకే తల్లి క్యారెక్టర్‌కు సాయిపల్లవి ఎలా ఒప్పుకుంది అనుకుంటున్నారా.. సాయి పల్లవి క్యారెక్టర్ అలాంటిది మరి. 
 
సాయిపల్లవికి బాగా నచ్చిన క్యారెక్టర్.. అందులోనూ హీరో కన్నా హీరోయిన్‌గా ప్రాధాన్యమున్న సినిమా కావడంతో సాయిపల్లవి ఒకే చెప్పేసింది. ఆ సినిమా చివరి దశకు కూడా చేరుకుంది. ఈ సినిమా నా క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. తల్లిగా భావోద్వేగాలను నేను పండించగలనా అని అనుమానం ఉనింది. 
 
కానీ నేను చేయగలను అని దర్శకుడు విజయ్ చెప్పినప్పుడు నాలో ఆత్మస్థైర్యం పెరిగింది. చేయగలిగాను. నాకు దర్శకుడు వందకు వంద మార్కులు వేశారు. నాకు చాలా సంతోషంగా ఉందంటూ సాయిపల్లవి తన స్నేహితులతో చెబుతోందట. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. 'ఫిదా' తర్వాత 'కణం' సినిమా నాకు మంచి పేరు తెస్తుందన్న నమ్మకంతో ఉంది సాయిపల్లవి. మరి చూడాలి.. 'కణం' సినిమా సాయిపల్లవి ఆశను నెరవేరుస్తుందో.. లేదో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments