Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా ఫిదా భామ..? (video)

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (12:57 IST)
మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా ఫిదా భామ సాయిపల్లవి నటించనుంది. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ''ఆచార్య'' సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాతో మెహర్ రమేష్ చిత్రానికి ఓకే చెప్పాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో కథానాయికుడిగా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నాడు. 
 
త్వరలోనే రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఇక  ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన షెడ్యూల్ కంప్లీట్ చేసి వచ్చే యేడాది సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 
 
మరోవైపు చిరంజీవి.. మలయాళ సూపర్ హిట్ ''లూసీఫర్'' రీమేక్‌లో యాక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ముందుగా సుజిత్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేయాలనుకున్నా.. ఫైనల్‌గా ఈ రీమేక్ బాధ్యతలను వినాయక్ చేతిలో పెట్టారు చిరంజీవి. 
 
ఈ సినిమా తర్వాత చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక యాక్షన్ స్టైలిష్ ఓరియంటెడ్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను తమిళంలో అజిత్ హీరోగా నటించిన ''వేదాలం'' సినిమాకు రీమేక్.
 
సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో చెల్లెలు పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ  క్యారెక్టర్‌ను ఎవరైనా స్టార్ హీరోయిన్ చేస్తేనే ఆ సినిమాకు సరిపోతుంది. అందుకే ఈ సినిమాలో చిరంజీవి సిస్టర్ పాత్రకు రౌడీ బేబి సాయి పల్లవి పేరును పరిశీలిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments