Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లినెలా పెళ్ళి చేసుకుంటానంటున్న యువ హీరో?

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (21:21 IST)
సినిమాల్లో హీరోహీరోయిన్లలపై గాసిప్స్ మామూలే. పెళ్ళి కాకుంటే ఇక చెప్పాలా. వీరి మీద వారికి, వారి మీద వీరికి ఇలా ఒకరి గురించి మరొకరికి లింక్‌లు అంటగట్టేస్తూ ఉంటారు. నా పాపాన నేను ఏదో సినిమాలు చేసుకుంటున్నాను. హిట్ కోసం పరితపిస్తున్నాను. కానీ ఇప్పుడు నాపై బాగానే దుష్ర్పచారం జరుగుతోంది.
 
నేను కొంతమందిని ప్రేమించానని, వాళ్ళతో బాగా క్లోజ్‌గా ముందుకు వెళ్ళి ఆ తరువాత బ్రేక్‌అప్ అయిపోయిందని, ఈ ప్రచారమంతా సినీ పరిశ్రమలో మామూలే. ఒక యువ హీరోగా నేను ఇలాంటివి పట్టించుకోనంటున్నారు సాయిధరమ్ తేజ్. 
 
నా కుటుంబం మొత్తం సినీరంగంలో ఉంది. నేను సినీరంగంలో నాకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాను. కొంతమంది మీడియా వారు ఏదో రాయాలని రాసేస్తుంటారు. మొదట్లో ఎక్కువగా రాశీ ఖన్నాకు నాకు లింక్‌లు పెట్టేశారు. సుప్రీం సినిమా షూటింగ్ జరిగేటప్పుడైతే ఆమెను పెళ్ళి చేసుకోబోతున్నానని రాసేశారు. నేను నవ్వి ఊరుకున్నాను. 
 
నేను రాశీఖన్నాను చెల్లెలిగా అనుకుంటుంటాను. ఆమె మంచి యాక్టర్. మా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తాను. నన్ను రాశీ ఖన్నా అప్పుడప్పుడు ఆటపట్టిస్తూ ఉంటుంది. తమాషాగా బావా అంటుంది. నేను అన్న అని పిలవమంటాను. అయితే సరదాగా ఆటపట్టించడం ఆమెకు అలవాటు. నేను మాత్రం రాశీఖన్నాను చెల్లెలుగానే భావిస్తానంటున్నాడు సాయి ధరమ్ తేజ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎంఐఎం గెలుపు

పరువు నష్టం దావా కేసులో మేధా పాట్కర్ అరెస్టు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments