Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో వెంకీ కుమార్తె వివాహం.. హాజరైన సల్మాన్ ఖాన్

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (14:18 IST)
రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం అట్టహాసంగా జరుగనుంది. ఆదివారం జరిగే ఈ వేడుక కోసం సెలెబ్రెటీలు భారీ స్థాయిలో హాజరుకానున్నారు. ఈ వివాహ వేడుకలో భాగంగా శుక్రవారం రాత్రి ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దగ్గుబాటు కుటుంబీకులతో పాటు బంధుమిత్రులు, సినీ ప్రముఖులు, స్నేహితులు హాజరయ్యారు.  
 
వెంకటేష్ కుమార్తె అశ్రిత, హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించడంతో పెళ్లితో ఒక్కటవుతున్నారు. ఈ పెళ్లి వేడుక కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. రానా దగ్గుబాటి, నాగచైతన్య, సమంత తదితరులు కూడా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌‌లో పాల్గొని సందడి చేశారు.
 
ఇకపోతే.. ఈ నెల 28న వివాహ రిసెప్షన్‌ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. వరుడు వినాయక రెడ్డి హైదరాబాద్‌లోని రేస్‌ క్లబ్‌ అధిపతి సురేందర్‌ రెడ్డి మనవడు. ఈ వివాహం నేపథ్యంలో వెంకటేశ్‌ 'వెంకీ మామ' చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments