Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 ఏళ్ల వృద్ధురాలిగా సమంత.. అనుకుంటే అలా మారిపోతుందట..

''ఏ మాయ చేసావె'' సినిమాతో తెరంగేట్రం చేసిన సమంత.. ఆపై అగ్ర హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. తన తొలి సినిమా హీరోనే ప్రేమించి పెళ్లాడిన సమంత.. పెళ్లికి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది. అంతేకాకుండా బంపర్ హ

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (18:04 IST)
''ఏ మాయ చేసావె'' సినిమాతో తెరంగేట్రం చేసిన సమంత.. ఆపై అగ్ర హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. తన తొలి సినిమా హీరోనే ప్రేమించి పెళ్లాడిన సమంత.. పెళ్లికి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది. అంతేకాకుండా బంపర్ హిట్ సినిమాల రికార్డును తన ఖాతాలో వేసుకుంటోంది. ఇప్పటికే పెళ్లికి తర్వాత సమంత నటించిన రాజుగారి గది 2, రంగస్థలం, మహానటి చిత్రాలు హిట్ అయ్యాయి. 
 
ప్రస్తుతం యూటర్న్, సూపర్ డీలక్స్, సీమరాజా వంటి సినిమాల్లో సమంత నటిస్తోంది. అంతేగాకుండా.. తన భర్తతో కలిసి జంటగా కొత్త సినిమాలో కనిపించనుంది. మరోవైపు విభిన్న పాత్రలు పోషించడంలో సమంత కేరాఫ్ అడ్రస్‌గా మారింది. విభిన్నమైన కథలను, పాత్రలను ఎంచుకుంటూ సమంత వరుస విజయాలను అందుకుంటోంది. గ్లామర్‌తో పాటు నటనకి ఎక్కువగా అవకాశం వుండే పాత్రలను అంగీకరిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. అలాంటి సమంత తాజాగా మరో విభిన్న రోల్‌లో కనిపించనుంది. 
 
దర్శకురాలు నందినీ రెడ్డి.. సమంతకు మధ్య కొన్ని రోజులుగా కథా చర్చలు జరుగుతున్నాయట. ఇది 2014లో వచ్చిన కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి రీమేక్ అని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపిస్తూ ఉంటుంది. అతీత శక్తులను కలిగిన ఆమె అవసరమైనప్పుడు యవ్వనవతిగా మారిపోతూ ఉంటుంది. అలాంటి పాత్రలో సమంతను చూపించాలనే ఉద్దేశంతోనే నందినీ రెడ్డి ఉన్నారట. ఈ కథ సమంతకు నచ్చడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments