Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే మహానటిలో సావిత్రిగా సమంతకు బదులు కీర్తి సురేష్

అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమ

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2017 (14:51 IST)
అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎవడే సుబ్రమణ్యం ఫేమ్‌ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
మోహన్ బాబు, క్రిష్, తరుణ్ భాస్కర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత, షాలిని పాండే, భానుప్రియ వంటి భారీ తారాగణంతో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి నిర్మాత స్వప్నదత్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో టైటిల్ పాత్రకు సమంత అయితే బాగుంటుందని భావించామని తెలిపారు. 
 
ఈ క్రమంలోనే సమంతను కూడా ఎంపిక చేశామన్నారు. ఆ తర్వాత సావిత్రి పాత్రకు కొత్త అమ్మాయితో చేయిస్తే బాగుంటుందని భావించి.. కీర్తి సురేష్‌ను తీసుకున్నామన్నారు. సావిత్రి జీవితానికి సంబంధించిన పూర్తి వివరాలను, ఆమె కూతురు విజయ చాముండేశ్వరి దగ్గర నుంచి సేకరించామని స్వప్నదత్ తెలిపారు. సావిత్రికి ముందు కీర్తి సురేష్ పాపులర్ కాకపోయినా.. సావిత్రిలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కీర్తికి మంచిపేరు వచ్చిందని స్వప్నదత్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments