కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన సందీప్ కిష‌న్, ఏంట‌ది?

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (22:04 IST)
కథానాయకుడిగా, నిర్మాతగా ఈ ఏడాది సందీప్ కిషన్ మంచి విజయాలు అందుకున్నారు. ఆయన నిర్మాతగా పరిచయమైన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చిన ఆ చిత్రం, కథానాయకుడిగా సందీప్ కిషన్‌కు మంచి విజయం అందించింది. అలాగే, ‘తెనాలి రామకృష్ణ’తో కమర్షియల్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు సందీప్ కిషన్. ఈ సంతోష సమయంలో తల్లిదండ్రులకు బెంజ్ జిఎల్ఈ 350డి కారును ఆయన బహుమతిగా ఇచ్చారు.
 
సందీప్ కిషన్ నటుడు, నిర్మాత మాత్రమే కాదు. మంచి వ్యాపారవేత్త కూడా! జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ‘వివాహ భోజనంబు’ పేరుతో ఆయనకు పలు రెస్టారెంట్లు ఉన్నాయి. విజయవంతంగా రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఆయన, కొత్తగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో ఆయన ఒక సెలూన్ ప్రారంభించనున్నారు.
 
స్టైలిష్ రంగంలో పేరొందిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ కిషన్ తీసుకున్నారు. త్వరలో ఆ సెలూన్ ప్రారంభం కానుంది. ఇక, సినిమాల విషయానికి వస్తే… హాకీ నేపథ్యంలో సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

మే 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

రెండోసారి కూతురే పుట్టిందని 10 నెలల పసికందును హతమార్చిన కన్నతండ్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

తర్వాతి కథనం
Show comments