Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆది సాయికుమార్ ఫిల్మ్‌ 'శ‌శి' ఫిబ్ర‌వ‌రి 12 విడుద‌ల‌

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (09:47 IST)
Sasi
ఆది సాయికుమార్ హీరోగా శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'శ‌శి'. సుర‌భి నాయిక‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్‌.పి. వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు నిర్మిస్తున్నారు. ల‌వ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.
 
ప్రేక్ష‌కుల‌కు సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఈ మేర‌కు ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో హీరో హీరోయిన్లు ఆది, సుర‌భి రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై వెళ్తున్నారు. ఆదిని ప్రేమ‌గా కౌగ‌లించుకొని సుర‌భి క‌ళ్లు మూసుకొని ఉంటే, ఆది ఆనందంగా న‌వ్వుతున్నాడు. ఇటీవ‌ల ఆది సాయికుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది.
 
టీజ‌ర్‌లో ఆది స‌రికొత్త‌గా క‌నిపిస్తున్నాడ‌నీ, అత‌నికి ఈ సినిమా బ్రేక్ నిస్తుంద‌నే న‌మ్మ‌కం క‌లుగుతోంద‌నీ చెప్ప‌డంతో పాటు, ఒక ఫ్రెష్ స‌బ్జెక్ట్‌తో ఈ సినిమా తీసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంద‌నీ చిరంజీవి ప్ర‌శంసించారు. అరుణ్ చిలువేరు సంగీతం అందించిన ఈ చిత్రానికి అమ‌రనాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు.
 
తారాగ‌ణం:
ఆది సాయికుమార్‌, సుర‌భి, రాజీవ్ క‌న‌కాల‌, జ‌య‌ప్ర‌కాష్‌, అజ‌య్‌, వెన్నెల కిశోర్‌, రాశీ సింగ్‌, తుల‌సి.
సాంకేతిక బృందం:
ద‌ర్శ‌కుడు: శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల‌
నిర్మాత‌లు: ఆర్‌.పి. వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు
సినిమాటోగ్రీఫీ: అమ‌ర‌నాథ్ బొమ్మిరెడ్డి
మ్యూజిక్‌: అరుణ్ చిలువేరు
ఎడిటింగ్‌: స‌త్య జి.
డైలాగ్స్‌: ఐ. ర‌వి
ఆర్ట్‌: ర‌ఘు కుల‌క‌ర్ణి
కొరియోగ్ర‌ఫీ: విశ్వ ర‌ఘు
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: రాఘ‌వ చౌద‌రి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments