Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలిని హాలీవుడ్‌ సినిమాలతో పోల్చలేం.. చూడాలనిపించలేదు: సయానీ

బాహుబలి-2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వేళ.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సయానీ గుప్తా షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ 'హంగ్రీ' చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సర

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (09:22 IST)
బాహుబలి-2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వేళ.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సయానీ గుప్తా షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ 'హంగ్రీ' చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన సయానీ నటిస్తోంది. ఈ నేపథ్యంలో ‘బాహుబలి 2’ ట్రైలర్ చూశాక, ఈ సినిమా చూడాలని తనకు అనిపించలేదని, ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం తనకు వచ్చినా కూడా నటించనని సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి.. తొలి మూడు రోజుల్లోనే రూ.500 కోట్లు, పది రోజుల్లోనే రూ.వెయ్యి కోట్లు వసూలు చేసి భారతీయ సినిమా రికార్డులు తిరగరాసింది.
 
దర్శక దీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ రికార్డులు బద్దలు కొట్టింది. అమెరికాలో హాలీవుడ్‌ చిత్రాలతో పోటీపడి కలెక్షన్ల వర్షం కురిపించింది. కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్‌, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో బాహుబలిని హాలీవుడ్ చిత్రాలతో పోల్చలేమని, అదో భారీ చిత్రం మాత్రమేనని సయానీ తెలిపింది. ‘బజరంగీభాయ్ జాన్’ లాంటి సినిమాల్లో నటించాలని తనకు ఉందని, ఈ సినిమా అద్భుతంగా వుంటుందని సయానీ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments