Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటి కవిత కుమారుడు కరోనా మృతి.. భర్త ఆరోగ్య పరిస్థితి కూడా..?

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (12:14 IST)
Kavitha
తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. ఇప్పటికే ఎంతో మంది పలు కారణాలతో ప్రాణాలను కోల్పోయారు. అలాగే, చాలా మంది నటులు, టెక్నీషియన్లు, సినీ కార్మికులు కరోనా మహమ్మారి బారిన పడి కన్నుమూశారు. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తాజాగా సినీ కుటుంబంలో మరో దురదృష్టకర సంఘటన జరిగింది. 
 
సీనియర్ నటి కవిత కుమారుడు కరోనాతో కన్నుమూశాడు. అలాగే, ఆమె భర్త పరిస్థితి కూడా దారుణంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కవిత కుటుంబంలో కరోనా తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. వాళ్ల ఇంట్లో వరుసగా ఒకరి తర్వాత ఒకరు కోవిడ్ పాజిటివ్‌గా తేలారు. 
 
ఈ నేపథ్యంలో ఓ వైపు చేతికి అందిన కొడుకు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. ఆమె భర్త కూడా కోవిడ్‌తో పోరాటం చేస్తున్నారు. కవిత భర్తకు కూడా కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన అప్పటి నుంచి చికిత్సను తీసుకుంటున్నారు. 
 
ఇక, కవిత విషయానికి వస్తే.. 11 ఏళ్ల వయసులోనే ‘సిరి సిరి మువ్వ' అనే సినిమాతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించారు. తెలుగులోనే కాదు.. దక్షిణాదిలో ఉన్న పలు భాషల్లోనూ ఆమె నటించారు. తద్వారా మంచి గుర్తింపును అందుకున్నారు. ఈమె సింగపూర్‌కు చెందిన దశరథరాజ్‌ను 19వ ఏటనే పెళ్లాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments