Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ బృందా విహారితో ట్రెండింగ్ లిస్ట్‌లలో షిర్లీ సెటియా మొదటి స్థానం

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (15:13 IST)
Shirley Setia
యూట్యూబ్ సంచలనం, గాయని, నటి షిర్లీ సెటియా  న్యూజిలాండ్ కు చెందిన భారతీయ సినిమా నటి. 2020లో హిందీ సినిమా మస్కా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.  2022లో కృష్ణ వ్రింద విహారి తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా థియేట‌ర్‌లో కంటే ఓటీటీలో బాగానే ఆద‌ర‌ణ పొందుతోంది. ప్రాంతీయ విభాగంలో కృష్ణ బృందా విహారితో ట్రెండింగ్ లిస్ట్‌లలో షిర్లీ సెటియా మొదటి స్థానం సంపాదించుకుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ నెటిజ‌న్ల‌లో త‌న ఆనందాన్ని పంచుకుంది. 
 
అంత‌కుముందు అభిమన్యు దాసాని మరియు శిల్పాశెట్టితో కలిసి `నికమ్మ`లో  అరంగేట్రం చేసింది. ఆమె నటనా నైపుణ్యం బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులు ప్రేమలో పడ్డారు. గాయనిగా షిర్లీ తన మధురమైన స్వరంతో అందరికీ పోటీప‌డుతూ  తనకు పోటీ లేదని ప్రపంచానికి నిరూపించింది.
 
రొమాంటిక్ జానర్ మూవీ "కృష్ణ బృందా విహారి"లో నటుడు నాగ శౌర్యతో కలిసి దక్షిణాదికి అరంగేట్రం చేసింది. ఈ చిత్రానికి వ‌చ్చిన ఆద‌ర‌ణ‌తో  తన అభిమానుల ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలిపేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లారు. అభిమానులు ఎప్పుడూ ఆమె ఆర్టిస్ట్ ప్రాజెక్ట్‌ల పట్ల ఉత్సాహం చూపుతుంటారు. అదే త‌న‌కు శక్తిని ఇస్తుంద‌ని తెలిపింది. తాజాగా మ‌రో ప్ర‌ముఖ హీరోతో క‌లిసి న‌టించేంద‌కు సిద్ధ‌మైన‌ట్లు త్వ‌ర‌లో వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని తెలియ‌జేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments