Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఐశ్వర్య రాయ్‌నా? శరీరాకృతిపై బాధలేదు : స్నేహా ఉల్లాల్

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (15:53 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఉల్లాసంగా ఉత్సాహంగా అనే చిత్రం ద్వారా పరిచయమైన నటి స్నేహా ఉల్లాల్. ఆ తర్వాత ఈమె నటించిన చిత్రం నేను మీకు తెలుసా. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం కింగ్ నాగార్జున వంటి హీరోల సరసన కూడా నటించింది. అయితే, ఈ అమ్మడు సినీ కెరీర్ తెలుగులో సాఫీగా సాగలేదు. దీంతో గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది. 
 
ఈ క్రమంలో ఎక్స్‌పైరీ డేట్ అనే చిత్రం ద్వారా ఐదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా మాట్లాడుతూ, తాను శరీరాకృతి గురించి ఎన్నడూ ఇబ్బంది పడలేదన్నారు. అయితే, తనను అందరూ ఐశ్వర్యరాయ్‌లా తాను ఉన్నావని అనుకోవడం కూడా తనను బాధపెట్టలేదని చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమలో ప్రమోషన్‌ కోసమే తనను అలా పరిచయం చేశారని ఆమె తెలిపింది.
 
తన జీవితంపై తనకు ఎలాంటి బాధ లేదుకానీ, సినీ పరిశ్రమలోకి మాత్రం చాలా త్వరగా వచ్చానని భావిస్తున్నానని అభిప్రాయపడింది. ఇంకొన్నాళ్లు సినిమా రంగంలోకి రాకపోయి ఉంటే కనుక నటిగా తనకు తాను చాలా శిక్షణ ఇచ్చుకునేదాన్నని చెప్పింది. తాను చాలా ఏళ్ల అనంతరం 'ఎక్స్‌పైరీ డేట్‌' సినిమాతో మళ్లీ వస్తున్నానని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments