Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో మహేష్ బాబు రాజకీయ ప్రవేశం ఖాయమా?.. వారిద్దరూ అంతే...

హీరో మహేష్ బాబు రాజకీయ ప్రవేశం చేయడం ఖాయమా? అవుననే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. తమిళ హీరో విజయకాంత్, మెగాస్టార్ చిరంజీవిలే ఇందుకు మంచి ఉదాహరణ అని అంటున్నారు. దీనికి ఓ బలమైన కారణాన్ని చెపుతున్నారు.

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (11:46 IST)
హీరో మహేష్ బాబు రాజకీయ ప్రవేశం చేయడం ఖాయమా? అవుననే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. తమిళ హీరో విజయకాంత్, మెగాస్టార్ చిరంజీవిలే ఇందుకు మంచి ఉదాహరణ అని అంటున్నారు. దీనికి ఓ బలమైన కారణాన్ని చెపుతున్నారు. 
 
తమిళ దర్శకుడు ఏఆర్.మురుగదాస్. ఈయన దర్శకత్వంలో నటించిన హీరో ఖచ్చితంగా రాజకీయ ప్రవేశం చేయాల్సిందేనని అంటున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'రమణ' తర్వాత విజయకాంత్, 'స్టాలిన్' తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని గుర్తుచేశారు. ఆ కోవలోనే ప్రిన్స్ మహేష్ బాబు రాజకీయ అరంగేట్రం చేస్తారని అంటున్నారు. 
 
విభిన్న కథాంశాలను ఎంచుకుని, వాటిని ప్రేక్షకులకు నచ్చేలా చిత్రీకరించడంలో పేరున్న ప్రముఖ దక్షిణాది దర్శకుడు మురుగదాస్ గతంలో తీసిన 'రమణ' తరువాత విజయకాంత్ రాజకీయాల్లోకి వచ్చారు. ఇక అదే మురుగదాస్ చిరంజీవి హీరోగా 'స్టాలిన్' తీయగా, ఆపై ఆయన కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 
 
ఇప్పుడు అదే మురుగదాస్, మహేష్ హీరోగా 'స్పైడర్'ను సిద్ధం చేశారు. ఇక 'స్పైడర్' తర్వాత మహేష్ కూడా సెంటిమెంట్ ప్రకారం, రాజకీయాల్లోకి వస్తారా? ఇదే ప్రశ్న మహేష్ బాబుకు చెన్నైలో ఎదురైంది. మీడియా సమావేశంలో మహేష్ పాల్గొన్న వేళ, ఈ ప్రశ్న ఎదురుకాగా, తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు ప్రిన్స్. తనకు రాజకీయాలంటే స్పెల్లింగ్ కూడా తెలియదని తేల్చిపారేశాడు. కాగా, "స్పైడర్" ఈనెల 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments