Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్-2లో నేను లేను.. నా దురదృష్టం.. కొంతమందికి మాత్రం హ్యాపీ: శ్రీరెడ్డి

తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బిగ్‌బాస్-2లో శ్రీరెడ్డి కూడా కంటిస్టెంట్‌గా ఎంపికైనట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. నాని వ్యాఖ్యాతగా జూన్

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (14:18 IST)
తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బిగ్‌బాస్-2లో శ్రీరెడ్డి కూడా కంటిస్టెంట్‌గా ఎంపికైనట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. నాని వ్యాఖ్యాతగా జూన్ పదో తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది. 16మంది సెలబ్రిటీలు 100 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటారు. ఈ నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పి.. ఇటీవలి కాలంలో సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలిచిన సినీ నటి శ్రీరెడ్డి కూడా ఈ షోలో పాల్గొననున్నట్టుగా వార్తలొచ్చాయి. 
 
కానీ బిగ్ బాస్-2లో తాను పాల్గొనలేదని శ్రీరెడ్డి స్పష్టం చేసింది. ఇది తన దురదృష్టం, తన స్నేహితులకు చేదువార్తని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తన స్నేహితులు అప్సెట్ అయినా.. కొంతమందికి సంతోషాన్నిస్తుందని శ్రీరెడ్డి చెప్పింది. పోటీదారులు అదృష్టవంతులు, బిగ్ బాస్ 2 బృందానికి ఆల్ ది బెస్ట్ అంటూ శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.
 
ఇకపోతే.. బిగ్ బాస్ 2 అనేది కొంత వరకు లైవ్ షో. కొంత ఎడిటెడ్ వర్క్. అలాంటి షోలో కనుక శ్రీరెడ్డి పాల్గొని, తన చిత్తానికి మాట్లాడితే పరిస్థితి ఏమిటనే నిర్వాహకులు ఆమెను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. శ్రీరెడ్డి ఎప్పుడు ఎవరిపై ఆరోపణలు చేస్తుందో ఎవరికీ తెలియదు.
 
రేపు షో నుంచి బయటకు వచ్చాక, ఆమెతో పాటు పార్టిసిపేట్ చేసిన వారిపై ఆరోపణలు చేయదని గ్యారంటీ లేదు. అందుకే ఈ షో నుంచి ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. ఇక హోస్ట్ నాని అంటే శ్రీరెడ్డి అస్సలు పడదు. అందుకే ఆమెను నిర్వాహకులు షోలోకి తీసుకోలేదని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments