Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఎస్.రాజమౌళి తదుపరి ప్రాజెక్టు ఇదే.. కథ ఎలాంటిదో తెలుసా?

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీ ఇచ్చారు. "బాహుబలి 2" బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆయన ఎలాంటి ప్రాజెక్టును చేపడుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. దీనికితోడు కాస్త రిలీఫ్ లభించేల

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (16:35 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీ ఇచ్చారు. "బాహుబలి 2" బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆయన ఎలాంటి ప్రాజెక్టును చేపడుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. దీనికితోడు కాస్త రిలీఫ్ లభించేలా.. చిన్న ప్రాజెక్టును చేపడుతానని రాజమౌళి చెప్పినట్టు లోగడ వార్తలు కూడా వచ్చాయి. వీటిపై రాజమౌళి ఇపుడు క్లారిటీ ఇచ్చాడు. 
 
తాజాగా ఆయన ఓ సినిమా ఆడియో లాంచ్‌లో పాల్గొని మాట్లాడుతూ... "నేను చిన్న సినిమా తీయాలని అనుకోవట్లేదు. బాహుబలిని విజువల్ ఎఫెక్ట్స్‌తో తీశాను. వీఎఫ్ఎక్స్‌తో సినిమా తీయడం అంతా సులభం కాదు. కానీ, నేనిప్పుడు వీఎఫ్ఎక్స్‌తో సినిమా తీయను. అలా అని చిన్న సినిమా తీస్తానని కాదు. నా తదుపరి చిత్రం చిన్న సినిమా కాదు. విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా ఓ భారీ సినిమాను తీయొచ్చు" అని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ప్రస్తుతం తన తండ్రి ఓ ఎమోషనల్ కథను సిద్ధం చేస్తున్నారని, స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యాక ఆ కథకు తగినట్టుగా నటీనటులను ఎంపిక చేస్తామనంటూ రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటించే అవకాశం ఉన్నట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించే సూచనలు కనిపిస్తున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments