Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సుచీలీక్స్'' నా పాపం కాదు.. సెలెబ్రిటీలందరికీ క్షమాపణలు చెప్తున్నా: సుచిత్ర

సినీ ప్రపంచానికి ముచ్చెమటలు పట్టించిన సుచీలీక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ తనను గాయపరిచాడని ట్వీట్‌ చేసిన సుచిత్ర ఆపై కోలీవుడ్‌కు చెందిన అనిరుధ్, ఆండ్రి

Webdunia
బుధవారం, 3 మే 2017 (13:04 IST)
సినీ ప్రపంచానికి ముచ్చెమటలు పట్టించిన సుచీలీక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ తనను గాయపరిచాడని ట్వీట్‌ చేసిన సుచిత్ర ఆపై కోలీవుడ్‌కు చెందిన అనిరుధ్, ఆండ్రియా, హన్సిక, రానా, త్రిష వంటి ఎంతోమంది సెలెబ్రిటీల ఫోటోలను నెట్లో పెట్టి హంగామా సృష్టించింది. సుచీలీక్స్‌తో సెలెబ్రెటీలు తమ గురించి ఏవైనా ఫోటోలు లీకైపోతాయా అంటూ జడుసుకున్నారు. 
 
ఇలా టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన హీరోహీరోయిన్ల ఫోటోలు నెట్లో హల్ చల్ చేశాయి. మొత్తానికి సుచీలీక్స్ దెబ్బకు సినీ ప్రపంచం షాక్ తింది. అయితే ఈ లీక్స్ గురించి ప్రస్తుతం సుచిత్ర వివరణ ఇచ్చింది. ఇన్నాళ్లు సుచీలీక్స్‌తో షాక్ ఇచ్చిన సుచిత్ర.. కొద్ది రోజుల పాటు కనుమరుగైంది.

కానీ ప్రస్తుతం మళ్లీ సీన్లోకి వచ్చింది. ఈ లీక్స్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి ఈ తతంగాన్ని నడిపారని క్లారిటీ ఇచ్చింది. చెన్నైకి చెందిన ఓ సంస్థ తన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిందని ఫైర్ అయ్యింది. 
 
వాస్తవానికి ఎవరినీ నొప్పించడానికి తాను ఇష్టపడనని చెప్పింది. సుచీలీక్స్ తన తప్పు కానప్పటికీ.. తనపేరు వల్ల బాధపడిన సెలబ్రిటీలందరికీ క్షమాపణలు చెప్తున్నానని తెలిపింది. శత్రువైనప్పటికీ  అవమానించే తత్త్వం తనది కాదని చెప్పింది. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి తనకు ఆరు వారాల సమయం పట్టిందని తెలిపింది. తాను కోలుకోవడానికి తన భర్త, కుటుంబసభ్యులే కారణమని సుచిత్ర వెల్లడించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments