Webdunia - Bharat's app for daily news and videos

Install App

1989 కుప్పంలో జరిగిన క‌థ‌తో సుధీర్ బాబు 18వ చిత్రం

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (17:12 IST)
Sudhir Babu 18 poster
ఈరోజు సుధీర్ బాబు 18వ చిత్రం అధికారికంగా ప్రకటించారు. సెహరి సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సినిమా చేయనున్నారు సుధీర్ బాబు. ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
 
 అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సౌత్ బొంబాయికి చెందిన అరుణ్ గౌలి నుండి చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సుబ్రమణ్యం వచ్చిన ఇన్‌ల్యాండ్ లెటర్ కార్డ్ కనిపిస్తుంది. ''క్రిటికల్: నీ రాక అవసరం." అనే మెసేజ్ కూడా కార్డ్ పై వుంది. తుపాకీ, బుల్లెట్‌లు, పాత ఐదువందల రూపాయి నోటు, ల్యాండ్‌లైన్ ఫోన్ , సిగార్ తో పాటు  పోస్టర్‌లో దేవాలయం,  గ్రామ వాతావరణం కనిపిస్తుంది. అక్టోబరు 31న మాస్ సంభవం” అని ఆ రోజు వచ్చే అప్‌డేట్‌ ని గురించి పోస్టర్ లో సూచించారు మేకర్స్.
 
సుధీర్ బాబు 18 అనేది దైవిక అంశంతో కూడిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా, ఈ కథ 1989 కుప్పంలో జరుగుతుంది. ఇది సరైన నేటివిటీ చిత్రం, ఇది సుధీర్ బాబును మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ప్రెజెంట్ చేస్తుంది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ మహా సభలకు తెలుగు ప్రజలు తరలి రావాలి : కేంద్ర మంత్రి పెమ్మసాని

సింధు జలాలను నిలుపుతూ భారత్ చేపట్టే నిర్మాణాలను పేల్చేస్తాం : పాక్ మంత్రి వార్నింగ్!!

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments