Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుందరం మాస్టర్ ఇంగ్లిష్ పాఠాలు చెబితే ఏమైంది?

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (12:33 IST)
Harsha Chemudu
హ‌ర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్ర‌ధాన తారాగ‌ణంగా ఆర్‌.టి.టీమ్ వ‌ర్క్స్‌, గోల్ డెన్ మీడియా బ్యాన‌ర్స్‌పై క‌ళ్యాణ్ సంతోష్ దర్శ‌క‌త్వంలో ర‌వితేజ‌, సుధీర్ కుమార్ కుర్రు నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం ‘సుందరం మాస్టర్’. సుందరం అనే టీచర్ చుట్టూ నడిచే కథే ఇది. తను గవర్నమెంట్ టీచర్. సోషల్ స్టడీస్ బోధిస్తుంటాడు. అయితే మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెలో ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది.

అందులో అన్నీ వ‌య‌సుల‌వారు ఇంగ్లీష్ నేర్చుకోవ‌టానికి విద్యార్థులుగా వ‌స్తారు. మ‌రి సుంద‌రం మాస్టర్ వారికెలా ఇంగ్లీష్‌ను బోధించారు అనే విష‌యం ఎంట‌ర్‌టైనింగ్‌గా రూపొందించిన చిత్ర‌మే ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది.
 
న్యూ ఇయర్ సందర్భంగా ‘సుందరం మాస్టర్’ అటెండెన్స్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘సుందరం మాస్టర్’ మూవీ ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉండనుందనే విషయాన్ని ఈ ప్రోమోలో మరోసారి ఎలివేట్ చేశారు. సినిమాలో కీలక పాత్రల్లో నటించిన ఆర్టిస్టులకు భిన్నమైన పేర్లు, అవెందుకు వచ్చాయనే బ్యాక్‌డ్రాప్‌తో ఉన్న ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ‘సుందరం మాస్టర్’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫిిబ్రవరి 16న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను థియేటర్స్‌లతో ఎంజాయ్ చేయండంటూ మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు కమెడియన్‌గా మెప్పించిన హర్ష చెముడు.. ‘సుందరం మాస్టర్’ మూవీలో తొలిసారి ప్రధాన పాత్రధారిగా ఎలా మెప్పించబోతున్నారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
 
శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తోన్న ‘సుందరం మాస్టర్’ చిత్రానికి దీపక్ ఎరెగడ సినిమాటోగ్రఫీ అందించారు. చంద్రమౌళి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

love failure: హోటల్ గదిలో యువకుడి ఆత్మహత్య.. లవ్ ఫెయిల్యూరే కారణమా?

హరిద్వార్ రోడ్డుపై తాగుబోతు మహిళ రుబాబు (video)

22న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments