Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిలేరు నీకెవ్వరు సెకండ్ సాంగ్ ఎలా ఉండ‌బోతుంది..?

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (11:25 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’ తో సంక్రాంతికి రానున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ మైండ్ బ్లాక్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ రాగా ఆడియన్స్, ఫాన్స్ ఎదురు చూస్తున్న సెకండ్ సాంగ్, డిసెంబర్ 9న (సోమవారం) సాయంత్రం 5:04 కి విడుదల కానుంది.
 
‘సూర్యుడివో చంద్రుడివో’ అనే పల్లవి తో సాగే ఈ పాట వినసొంపైన ఫామిలీ మెలోడీ సాంగ్ గా ఉండనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంత గానో ఆకట్టుకునే ఒక సోల్ ఫుల్ మెలోడీ గా ఈ ‘సూర్యుడివో చంద్రుడివో’ సాంగ్ ని కంపోజ్ చేశారు. 
 
ఎన్నో మెలోడీ సాంగ్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ చేసిన మరో సూపర్ మెలోడీ సాంగ్ ఇది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకి సంబంధించి విడుదలైన పోస్టర్ కూడా ఇదొక ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉండే క్లాసీ సాంగ్ గా ఉండనుందని తెలియజేస్తోంది. ప్రముఖ పంజాబీ సింగర్, కంపోజర్ బి ప్రాక్ ఈ పాటతో గాయకుడిగా సౌత్ సినీ ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు.
 
 
సరిలేరు నీకెవ్వరు టీం అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఒక స్ట్రాటజీ ప్రకారం పాటలని విడుదల చేస్తూ ప్రమోట్ చేస్తోంది. ఈ సంక్రాంతికి అన్ని హంగులతో ఆల్ క్లాస్ ఆడియన్స్, ఫాన్స్ కి ఫీస్ట్ గా, సంక్రాంతి ఎంటర్టైనర్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ ఉండబోతోంది. 
 
దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో సూపర్ స్టార్ మహేష్ క్యారక్టరైజెషన్, కామెడీ టైమింగ్ హైలైట్స్ గా ఉండనున్నాయి. జనవరి 11, 2020 న ప్రపంచ వ్యాప్తంగా సరిలేరు నీకెవ్వరు విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments