Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోళా శంకర్ లో ప్రత్యేక పాత్రలో సుశాంత్

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (15:26 IST)
Sushanth
మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ ల క్రేజీ ప్రాజెక్ట్  “భోళా శంకర్”. ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రంలో కీలక పాత్రల్లో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా  కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన , లవర్ బాయ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. సుశాంత్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు.
 
సుశాంత్  లీడ్ రోల్స్ తో  పాటు ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలని ఎంపిక చేసుకుంటున్నారు. భోలా శంకర్‌లో అతని పాత్ర చాలా కీలకంగా వుంటుంది. పోస్టర్‌లో సూట్‌లో లైట్ గడ్డంతో ఛార్మింగా కనిపిస్తున్నాడు.
 
మహా శివరాత్రి సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన మోషన్ పోస్టర్‌ చిరంజీవిని ఫెరోషియస్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. మిగతా ప్రమోషనల్ కంటెంట్ కు  అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
 
క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
 
తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ , రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments