Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ ప్రియురాలు రియాకు బిగుస్తున్న ఉచ్చు - రూ.15 కోట్లు ఏమయ్యాయి?

Webdunia
బుధవారం, 29 జులై 2020 (14:26 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దేశంలో పెను సంచలనమే రేపింది. ముఖ్యంగా, మూవీ ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం (బంధుప్రీతి) అంశం తెరపైకి వచ్చింది. గతంలో హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ అంశం ఉంటే.. ఇపుడు నెపోటిజం అంశం వెలుగులోకి వచ్చింది. ఇపుడు సుశాంత్ కూడా నెపోటిజం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారనే విమర్శలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. దీంతో ముంబై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు.. అనేక మంది బాలీవుడ్ సెలెబ్రిటీలను విచారిస్తున్నారు. 
 
ఈ క్రమంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని కూడా విచారించారు. అయితే, ఎక్కువ మంది రియా - సుశాంత్ ప్రేమబంధంపై అనేక విషయాలు వెల్లడించారు. పైగా, సుశాంత్ తండ్రి కూడా రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ రియా చక్రవర్తి గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించింది. ముఖ్యంగా సుశాంత్ ప్రియురాలిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. 
 
సుశాంత్ ఆత్మహత్య విషయంలో రియాపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. సుశాంత్ మరణానికి ముందు బాలీవుడ్ నిర్మాత మహేశ్ భట్‌తో ఆమె సన్నిహితంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, రియాపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ పోలీసులకు కొన్ని విషయాలను చెప్పారు. దీంతో, రియాపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రియాకు పోలీసుల ఉచ్చు బిగుస్తోంది.
 
పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్‌లో సుశాంత్ తండ్రి ఏం చెప్పారంటే... గత ఏడాది కాలంలో రూ.17 కోట్లలో ఒక అజ్ఞాత వ్యక్తికి రూ.15 కోట్లు బదిలీ అయ్యాయని.. ఇందులో రియా పాత్ర ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలని పోలీసులను ఆయన కోరారు. దీంతో, రియాపై పోలీసులు దృష్టిసారించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments