Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి చిప్పను బొడ్డు మీద వేయడం రాఘవేంద్ర రావు సృజనాత్మక అని తెలియదు : తాప్సీ

కొబ్బరి చిప్పను బొడ్డుపై వేయడం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సృజనాత్మక అని తనకు తెలియదని సినీ నటి తాప్సీ వ్యాఖ్యానించింది. 'కొబ్బ‌రిచిప్ప‌ను బొడ్డు మీద వేయ‌డంలో శృంగారం ఏముందోన‌నే విష‌యం నాకు ఇప్ప‌టికీ

Webdunia
బుధవారం, 12 జులై 2017 (13:55 IST)
కొబ్బరి చిప్పను బొడ్డుపై వేయడం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సృజనాత్మక అని తనకు తెలియదని సినీ నటి తాప్సీ వ్యాఖ్యానించింది. 'కొబ్బ‌రిచిప్ప‌ను బొడ్డు మీద వేయ‌డంలో శృంగారం ఏముందోన‌నే విష‌యం నాకు ఇప్ప‌టికీ అర్థం కాలేదు' అంటూ ఓ యూట్యూబ్ కామెడీ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో న‌టి తాప్సీ వ్యాఖ్యానించింది.
 
ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా తొలి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడి గురించి ఇలా మాట్లాడతావా అంటూ నెటిజన్లు తాప్సీపై మండిపడుతున్నారు. 'నీకు విశ్వాసం లేదు... నువ్వు బాలీవుడ్ వెళ్లింది ద‌క్షిణాది సినిమాల వ‌ల్ల‌నే అనే విష‌యం గుర్తుపెట్టుకో' అంటూ చాలా మంది విమ‌ర్శించారు.
 
వీటిపై తాప్సీ వివరణ ఇచ్చింది. తొలి చిత్రం కావ‌డం వ‌ల్ల ద‌క్షిణాది ద‌ర్శ‌కుల సృజ‌నాత్మ‌క‌త త‌న‌కు అర్థం కాలేద‌ని, రొమాన్స్‌ను ఇలా కూడా చూపిస్తారా? అని మాత్రమే వ్యాఖ్యానించినట్టు చెప్పారు. ముఖ్యంగా 'రాఘ‌వేంద్ర‌రావుగారు చేసిందే నేను చెప్పాను. నాకు అలా అనిపించేంది చెప్పేశాను. ఈ విష‌యంపై ఆయన గానీ, నేను గానీ ఏ బాధ ప‌డ‌లేదు స‌రిక‌దా వీడియో చూసి న‌వ్వుకున్నాం. అన‌వ‌సరంగా ఆ విష‌యాన్ని మ‌ధ్య‌లో వాళ్లే వివాదం చేస్తున్నారు. అలాంటి వాళ్ల‌ని మేం ప‌ట్టించుకోం' తాప్సీ స్పష్టం చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments