Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సైరా"లో మిల్కీబ్యూటీ... కోర్కె తీర్చుకోనున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఇది చిరంజీవి 151వ చిత్రం. కె.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకు

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (16:12 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఇది చిరంజీవి 151వ చిత్రం. కె.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే, ఈ చిత్రంలో హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషించనుందనే వార్త హల్‌చల్ చేస్తోంది. 
 
నిజానికి తెలుగు.. తమిళ భాషల్లో తమన్నాకు విపరీతమైన క్రేజ్ వుంది. హిందీలోనూ ఆమెకి గుర్తింపు వుంది. ప్రస్తుతం ఆమె 'క్వీన్' రీమేక్‌లోను... కల్యాణ్ రామ్ జోడీగా 'నా నువ్వే' సినిమా చేస్తోంది. ఇక "సైరా" సినిమాలోను ఆమె ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. 
 
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకిగాను తమన్నా అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందుకు సంబంధించిన సంప్రదింపులు కూడా మొదలైపోయాయని అంటున్నారు. నయనతారతో పాటు మరో కథానాయిక పాత్ర కావొచ్చని అనుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం వుంది.
 
గతంలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నిర్మించిన 'బాహుబలి' చిత్రంలో నటించింది. ఇందులో తన అందచందాలను ఆరబోసి ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందింది. ఇపుడు సైరాలో ఛాన్స్ కొట్టేసింది. గతంలో తనకంటూ అవకాశం వస్తే తమన్నతో నటిస్తానంటూ చిరంజీవి మనస్సులో మాటను వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments