Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి రాధతో ఎస్ఐ వివాహేతర సంబంధం.. ఠాణాకు చేరిన పంచాయతీ!

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (09:23 IST)
కోలీవుడ్ సినీ నటి రాధతో ఓ ఎస్ఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ ఎస్ఐ‌కు వివాహమై ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. ఈ విషయాన్ని దాచిన ఎస్ఐ రాధను రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మించి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ ఒకే ఇంట్లో కాపురం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రాధను అనుమానిస్తూ వచ్చిన ఎస్.ఐ.. ఆమెను చిత్ర హింసలకు గురిచేయసాగాడు. ఈ వేధింపులు భరించలేని రాధ... చెన్నై విరుగంబాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ పంచాయతీ ఓ అసిస్టెంట్ కమిషనర్ వద్దకు చేరింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళ హీరో దివంగత మురళి నటించిన చిత్రం 'సుందరం ట్రావెల్స్'. ఇందులో హీరోయిన్‌గా పరిచయమైన నటి రాధ. ఆ తర్వాత సత్యరాజ్, కార్తీక్ వంటి హీరోల సరసన నటించింది. ఆ తర్వాత ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతినికి విడాకులు ఇచ్చింది. 
 
ప్రస్తుతం తన తల్లితో తలిసి సాలిగ్రామంలో ఓ ఇంట్లో నివసిస్తోంది. ఈ క్రమలో ఎన్నూరు పోలీస్ స్టేషన్‌లో పని చేసే ఎస్ఐ వసంత్‌రాజ్‌తో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికిదారితీసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉండసాగారు. 
 
అయితే, అప్పటికే వసంత్ రాజ్‌కు వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా ఆర్ఏ పురంలోని పోలీస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. కానీ, రాధపై మోజుపడిన వసంత్ రాజ్‌.. ఈమె ఇంట్లోనే అధిక సమయం ఉండసాగాడు. 
 
అయితే, రాధపై అనుమానం పెంచుకున్న వసంత్‌రాజ్... ఆమెను చిత్రహింసలకు గురిచేయసాగాడు. ప్రతి నిత్యం వేధించేవాడు. దుర్భాషలాడేవాడు. వీటిని భరించలేని రాధ పోలీసులను ఆశ్రయించింది. విరుగంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా, రాధను వసంత్ రాజ్ మోసం చేసినట్టు తేలింది. దీంతో ఈ పంచాయతీ వడపళని అసిస్టెంట్ కమిషనర్ చెంతకు చేరింది. 
 
ఇదిలావుంటే, వసంత్ రాజ్‌నే నమ్ముకున్న రాధ, అతన్ని సంప్రదించకుండా, తన ఆధార్ కార్డులో భర్త పేరు స్థానంలో వసంత్ రాజ్ పేరును చూపించింది. దీంతో వసంత్ రాజ్ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Namo Bharat: ఏప్రిల్ 24న నమో భారత్ రాపిడ్ రైలు సేవను ప్రారంభించనున్న ప్రధాని

Woman Constable: ఆర్థిక ఇబ్బందులు: ఆత్మహత్యకు పాల్పడిన మహిళా కానిస్టేబుల్

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments