Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న రైతులు.. నేడు నిర్మాతలు... టీవీ చానళ్ళకు ఏదీ ఉచితంగా ఇవ్వొద్దు.. విశాల్ ఆదేశం

తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన హీరో, నిర్మాత విశాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న కరవు కోరల్లో చిక్కుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతలకు మేలుచేకూర్చేలా నిర్ణయం తీసుకోగా, ఇపుడు నిర

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (08:53 IST)
తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన హీరో, నిర్మాత విశాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న కరవు కోరల్లో చిక్కుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతలకు మేలుచేకూర్చేలా నిర్ణయం తీసుకోగా, ఇపుడు నిర్మాతలకు ఆదాయం అర్జించిపెట్టేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో సంచలనంగా మారింది. 
 
ప్రస్తుతం టీవీ చానెల్స్ శాటిలైట్‌ రైట్స్‌ వ్యవహారంలో చిన్న, పెద్ద చిత్రాలకు తారతమ్యం చూపుతున్నాయి. కానీ, తమ సినిమాల పాటలు, ట్రైలర్లు, క్లిప్పింగ్‌లను ఉచితంగా తీసుకుని భారీగా ఆదాయాన్ని అర్జిస్తున్నాయి. ఇకపై టీవీ చానెల్స్‌కు ఏది కూడా ఉచితంగా ఇవ్వొద్దని నిర్మాతల సంఘం సభ్యులందరికీ విశాల్‌ సూచించారు. 
 
నిర్మాతలకు ఆదాయం సమకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, కంటెంట్‌కు డబ్బులు చెల్లించాలని టీవీ చానళ్లను కోరామని నిర్మాతల సంఘం కార్యవర్గ సభ్యులు తెలిపారు. సినిమాలకు సంబంధించిన పాటలు, ట్రైలర్లు, క్లిప్పింగ్‌లతో టీవీ చానళ్లకు భారీ ఆదాయం వస్తున్నప్పుడు దానిలో కొంత నిర్మాతలకు ఇవ్వడంలో తప్పులేదని ఆయన చెప్పుకొచ్చారు. 
 
కాగా, తమిళనాట ప్రతి సినిమా టిక్కెట్‌‌పై ఒక రూపాయి రైతులకు కేటాయించాలని గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. దీనిని గతంలో నిర్మాతలు వ్యతిరేకించారు. ఇప్పటికే నష్టాల్లో ఉంటే మళ్లీ రైతులకు ప్రతి టికెట్‌లో ఒక రూపాయి ఇవ్వలేమని విశాల్‌కు సినీ నిర్మాతలు తెలిపారు. వారి బాధను అర్థం చేసుకొనే విశాల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. విశాల్ నిర్ణయం ఇపుడు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments