Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీ పార్వతిగా తనుశ్రీ దత్తా? : డైరెక్టర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (15:03 IST)
స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా మూడు బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. వీటిలో ఒకటి యువరత్న బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. 
 
అలాగే, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్". ఇక మూడో చిత్రాన్ని ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నిర్మించనున్నారు. ఈ చిత్రం పేరు 'లక్ష్మీస్ వీరగ్రంథం'. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరక్కించనున్నారు. 
 
అయితే, ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన లక్ష్మీపార్వతిగా నటించేందుకు తెలుగు నటి శ్రీరెడ్డితో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతోంది. ఇపుడు కొత్తగా మరో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌లో మీటూ ఉద్యమానికి ఆజ్యంపోసిన సీనియర్ నటి తనుశ్రీ దత్తాను సంప్రదిస్తున్నట్టు సమాచారం. 
 
ఇప్పటికే దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఈ చిత్రంలో తనుశ్రీ దత్తా నటించేందుకు సమ్మతించినట్టయితే అదో పెద్ద సంచలనంగా మారనుంది. చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రచారం లభించడమేకాకుండా, జాతీయ మీడియా సైతం ఈ చిత్రంపై ఫోకస్ పెట్టే అవకాశాలు లేకపోలేదు. మొత్తంమీద లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రం మరోమారు వార్తలకెక్కే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments