Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీలోకి ''గీత గోవిందం''.. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ లేదా రష్మిక?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (11:33 IST)
టాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన తెలుగు సినిమా ''గీత గోవిందం'' హిందీలో రీమేక్ కానుంది. ఇప్పటికే యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా హిందీలో రీమేక్ అవుతున్న నేపథ్యంలో.. గీత గోవిందం సినిమా కూడా రీమేక్ చేసేందుకు నిర్మాతలు సన్నద్ధమవుతున్నారు. ''దఢక్'' యాక్టర్ ఇషాన్ కట్టర్ హీరోగా ఈ సినిమా రీమేక్ కానుందని తెలుస్తోంది. 
 
త్వరలోనే హీరోయిన్, దర్శకుడి ఎంపిక వుంటుందని బిటౌన్ వర్గాల సమాచారం. అయితే అతిలోక సుందరి కుమార్తె జాన్వీకపూర్‌ను హీరోయిన్‌గా తీసుకునే అవకాశం వుందని.. లేకుంటే రష్మికనే హీరోయిన్‌గా బిటౌన్ తెరంగేట్రం చేసే అవకాశాలు లేకపోలేదని సినీ జనం అభిప్రాయపడుతున్నారు. 
 
తెలుగులో విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన గీత గోవిందం సినిమా గత ఏడాది (2018) ఆగస్టు 15వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను బన్నీ వాసు తెరకెక్కించగా, గీతా ఆర్ట్స్ సంస్థపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యం వహించారు. 
 
తెలుగు గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, సంధ్య జానక్, కల్యాణి ఎన్, అభయ్ తదితరులు నటించిన ఈ సినిమాను రూ.10వేల కోట్లతో తెరకెక్కించారు. అయితే రూ.130కోట్ల మేర గీత గోవిందం కలెక్షన్ల వర్షం కురిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments