Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్ గ్యాప్‌లో ఎంబీబీఎస్.. మాస్క్ ధరించి ట్రీట్మెంట్.. శ్రీలీల

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (22:26 IST)
తెలుగు అమ్మాయిలలో టాప్ రేంజ్ స్టార్‌లెట్‌గా మారిన చిన్నది శ్రీలీల బిజీ తేనెటీగలా మారిపోయింది. అయినా చదువును పక్కన బెట్టలేదు. తన ఎంబీబీఎస్ డిగ్రీని అభ్యసించడానికి పని నుండి క్రమం తప్పకుండా విరామం తీసుకుంటుంది.
 
ఎందుకంటే ఆమె డాక్టర్‌గానూ, నటిగానూ రాణించాలనుకుంటోంది. అసలు శ్రీలీల వైద్యం వైపు వెళ్లేందుకు కారణం ఆమె ఫ్యామిలీనే. తన తల్లి, సోదరుడు వైద్యులు కావడం తనను డాక్టర్ వృత్తిని ఎంచుకునేలా చేయలేదని, కానీ దాని వెనుక మరొక కథ ఉందని నటి శ్రీలీల పేర్కొంది.
 
"ఒకరోజు నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడ ఆసుపత్రి సౌకర్యం చాలా దూరంలో ఉంది. ఆమె అనారోగ్యం బాధపడినా.. డాక్టర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆయనొచ్చినా చేసేందేమీలేదు. 
 
ఈ ఘటనతోనే డాక్టర్ కావాలనుకున్నాను. నేను అప్పటికే మెడిసిన్ ప్రవేశ పరీక్షకు హాజరైనాను. అభిరుచికి తోడు అంకితభావంతో కోర్సును కొనసాగించడానికి ప్రేరేపించింది" అని శ్రీలీల చెప్పారు. 
 
సినిమాల షూటింగ్‌లో, విరామం మధ్య ఎమ్‌బిబిఎస్‌కు ప్రిపేర్ అవుతానని చెప్పింది. అంతేగాకుండా షూట్ విరామ సమయంలో, ఆమె ఆసుపత్రికి వెళ్లి కోర్సును ప్రాక్టీస్ చేస్తుంది. 
 
నటిగా పరిచయం వున్న ఆమెను చూసినవారంతా గందరగోళానికి గురిచేస్తారనే ఉద్దేశంతో మాస్క్ ధరించి చికిత్స అందిస్తానని శ్రీలీల వెల్లడించింది. శ్రీలీల తదుపరి చిత్రం భగవంత్ కేసరి ఈ అక్టోబర్ 19న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments