Webdunia - Bharat's app for daily news and videos

Install App

కచ్చితంగా శ్రీదేవి బయోపిక్ తీస్తా.. విద్యాబాలన్‌కు ఆ ఛాన్సుంది?

అతిలోకసుందరి శ్రీదేవి బయోపిక్ తెరకెక్కేందుకు రంగం సిద్ధమవుతోంది. శ్రీదేవి బయోపిక్‌లో బాలీవుడ్ సుందరి విద్యాబాలన్ నటిస్తున్నట్లు సమాచారం. శృంగార తార సిల్క్ స్మిత బయోపిక్‌లో కనిపించిన విద్యాబాలన్.. అతిల

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (19:24 IST)
అతిలోకసుందరి శ్రీదేవి బయోపిక్ తెరకెక్కేందుకు రంగం సిద్ధమవుతోంది. శ్రీదేవి బయోపిక్‌లో బాలీవుడ్ సుందరి విద్యాబాలన్ నటిస్తున్నట్లు సమాచారం. శృంగార తార సిల్క్ స్మిత బయోపిక్‌లో కనిపించిన విద్యాబాలన్.. అతిలోక సుందరిగా నటించే అవకాశం వుందని బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
 
శ్రీదేవి బతికున్నప్పుడు ఆమెతో సినిమా కోసం ఓ కథను సిద్ధం చేసుకున్నానని.. కానీ అధి సాధ్యం కాలేదని.. అందుకే శ్రీదేవి బయోపిక్‌నైనా తెరకెక్కించాలని భావిస్తున్నట్లు మెహతా చెప్పారు. వెండితెరపై మరో శ్రీదేవి రాలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందువల్ల ఇప్పుడు సరైన నటి తనకు దొరికితే సినిమా చేసి దానిని శ్రీదేవికి అంకితం చేస్తానని మెహతా తెలిపారు. 
 
కచ్చితంగా శ్రీదేవి జీవితంపై సినిమా చేయగలనని హన్సల్ మెహతా పునరుద్ఘాటించారు. ఇకపోతే.. శ్రీదేవిపై ఆమె భర్త బోనీ కపూర్ కూడా డాక్యుమెంటరీ తీయాలని కసరత్తులు చేస్తున్నట్లు బిటౌన్ వర్గాల సమాచారం. కాగా శ్రీదేవి నటించిన మామ్ ఆమె చివరి సినిమా కాగా, షారూఖ్ ఖాన్ హీరోగా, శ్రీదేవి కీలక పాత్ర పోషించిన ''జీరో'' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments