Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుకోని సమస్యల్లో విజయ్‌ దేవరకొండ ‘హీరో’

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (15:17 IST)
అనుకున్నట్లే విజయ్ దేవరకొండ సినిమా హీరో కష్టాల్లో పడింది. అయితే దీనికి కారణం టాలీవుడ్‌లోని మెగా అభిమానులు కాదండోయ్. తమిళ సినీ పరిశ్రమలోని సినిమాలే. వివరాలలోకి వెళ్తే...  విజయ్‌ దేవరకొండ కథానాయకుడుగా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ‘హీరో’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతోంది. ఆనంద్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ నిర్మించబోతున్నారు. 
 
ఏప్రిల్‌ 22న న్యూఢిల్లీలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కాబోతోందని మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించగా... ఇప్పటికే "గ్యాంగ్ లీడర్" టైటిల్‌కి అభ్యంతరాలు వ్యక్తం చేసిన మెగా అభిమానులు ఈ హీరో టైటిల్‌కి అభ్యంతరాలు వ్యక్తం చేస్తారేమోనని కొందరు భావించారు. కానీ అనుకోని వైపు నుండి ఇప్పుడు ఒక ఇబ్బంది వచ్చి పడింది.
 
తమిళంలోనూ ‘హీరో’ టైటిల్‌తోనే విడుదల చేయాలనుకున్న యూనిట్‌కి తాజాగా శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికగా నటిస్తూ బుధవారం షూటింగ్ ప్రారంభించిన సినిమా పేరు కూడా ‘హీరో’నే కావడం తలనొప్పిగా మారింది. 
 
విజయ్‌ ‘హీరో’.. తమిళంలోనూ అదే టైటిల్‌తో విడుదల కాబోతోంది. ఇప్పుడు శివ కార్తికేయన్‌ సినిమాకి కూడా అదే టైటిల్ పెట్టడంతో సమస్య ఎదురైంది. దీంతో ఎవరో ఒకరు తమ సినిమాకు టైటిల్‌ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఏ చిత్ర బృందం రాజీపడనుందో.. వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments