Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి.. 29న ఏడు చిత్రాలు రిలీజ్

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు 2018 సంవత్సరం బాగా కలిసివచ్చినట్టు తెలుస్తోంది. ఈ యేడాది ఇప్పటివరకు విడుదలైన పెద్ద హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ విజయాన్ని నమోదు చేశాయి.

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (10:42 IST)
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు 2018 సంవత్సరం బాగా కలిసివచ్చినట్టు తెలుస్తోంది. ఈ యేడాది ఇప్పటివరకు విడుదలైన పెద్ద హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ విజయాన్ని నమోదు చేశాయి. ముఖ్యంగా, సంక్రాంతి రేసులో పెద్ద హీరోలు ఉండటంతో అనేక మంది చిన్న హీరోలు వెనక్కితగ్గారు. ఇలాంటి వారంతా ఇపుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులోభాగంగా, వచ్చే 29వ తేదీన ఏకంగా ఏడు చిత్రాలు విడుదలకానున్నాయి. ఆ వివరాలను పరిశీలిస్తే...
 
ఈనెల 29వ తేదీన విడుదల కానున్న చిత్రాల్లో 'పెళ్ళి చూపులు' ఫేం త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన "ఈ న‌గ‌రానికి ఏమైంది", ఇక 'జబర్దస్త్‌' ఫేం షకలక శంకర్‌ హీరోగా తెరకెక్కిన "శంభో శంకర", నందు హీరోగా తెరకెక్కిన 'కన్నుల్లో నీ రూపమే', గ్రాఫిక్స్‌ ప్రధానంగా రవి వీడే దర్శకత్వంలో తెరకెక్కిన "సంజీవని", రవిచావలి డైరెక్ట్ చేసిన "సూపర్‌ స్కెచ్", మోహన్‌ లాల్ - అల్లు శిరీష్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ డబ్బింగ్ సినిమా "యుద్ధభూమి", "నా లవ్ స్టోరీ", "మిస్ట‌ర్ హోమానంద్", "ఎస్కేప్ 2", "ఐపీసీ సెక్షన్" వంటి చిత్రాలు ఉన్నాయి. మ‌రి ఈ సినిమాల‌లో ఏ చిత్రం ప్రేక్ష‌కులని మెప్పిస్తుందో చూడాలి.
 
కాగా, ఈ యేడాది ఆరంభంలో "రంగ‌స్థ‌లం", "భ‌ర‌త్ అనే నేను", "మ‌హాన‌టి" వంటి చిత్రాలు భారీ విజ‌యాన్ని సాధించ‌గా, ద్వితీయార్ధంలో "స‌మ్మోహ‌నం" చిత్రం మంచి స‌క్సెస్ సాధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments