Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘సుబ్రహ్మణ్యపురం’ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (15:43 IST)
సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈషా రెబ్బా కథానాయిక. నవంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  విజయదశమి కానుకగా సోషల్‌మీడియాలో విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌ 24 గంటల్లో 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ రాబట్టి ట్రెండింగ్‌ అవుతోంది.
 
ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ.. భక్తిరస ప్రధాన ఇతివృత్తంతో సాగే మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యముంటుంది. నా సినీ ప్రయాణంలో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. 

నిర్మాత బీరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఇరవై ఐదవ చిత్రమిది. ఆయన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాం. తాజాగా విడుదలైన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. 
 
సుదీర్ఘ విరామం త‌ర్వాత ఎస్.పి బాలసుబ్రహ్మణ్యంగారు ఈ సినిమాలో ఓ గీతాన్ని ఆలపించడం గమనార్హం. ఈ పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మధుర ఆడియో ద్వారా చిత్ర గీతాలను త్వరలోనే విడుదల చేయనున్నాం.. అని అన్నారు.
 
సుమంత్, ఈషారెబ్బా, అలీ, సాయికుమార్, సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, నిర్మాత: బీరం సుధాకర్‌ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇచ్చిన సమాధానం : అమిత్ షా

Operation Sindoor: కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దు- పవన్ కల్యాణ్ (video)

OperationSindoor: మోదీ, భారత సాయుధ దళాలను కొనియాడిన చంద్రబాబు

భారత్ వెనక్కి తగ్గితే ఉద్రిక్తతలు నివారించేందుకు సిద్ధం : పాకిస్థాన్ శాంతిమంత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments