Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ఒక కిడ్నీతో ఇన్నాళ్లు బతికింది.. చివరికి నటి లీనా ఆచార్య మృతి..!

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (12:21 IST)
Lina Acharya
ప్రముఖ బుల్లితెర నటి లీనా ఆచార్య (30) అనారోగ్యంతో కన్నుమూశారు. ఒకే ఒక కిడ్నీతో ఇన్నాళ్లు బతికిన ఆమె చివరకు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. చిన్న వయస్సులోనే బుల్లితెరపై నటించి మంచి పేరు కొట్టేసిన ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంపై టీవీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మృతికి పలువురు టీవీ సినీరంగ ప్రముఖులు సంతాపం తెలిపారు.
 
క్లాస్ ఆఫ్ 2020 సేట్ జీ వంటి ఆప్కే ఆజానేసే మేరీ హానికారక్ బీవీ వంటి టీవీ కార్యక్రమాలతో లీనా ఆచార్య పాపులర్ అయ్యారు. ఆమె కొన్నేళ్లుగా కిడ్నీ సమస్య బాధపడుతున్నది. ఇటీవలే ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆమె మృతికి ప్రముఖ టీవీ నటుడు ఆమెతో కలిసి నటించిన రోహన్ మెహ్రా మరో నటుడు ఆయుష్ ఆనంద్ సంతాపం తెలిపారు. 
 
అయితే ఆమెకు చాలా కాలంగా కిడ్నీ సమస్య ఉన్నదని లీనా సోదరుడు చెప్పారు. అయితే లీనా మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పకుండా అందరితో సరదాగా ఉండేవారు. ఆమె ఎప్పుడూ తన ఆరోగ్యసమస్య గురించి చెప్పుకోలేదని ఆమెతో కలిసి పనిచేసిన వారు అంటున్నారు. ఇంత చిన్నవయసులో ఆమెకు చనిపోవడం షాక్‌కు గురిచేసిందని వాళ్లు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments