Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్య మీమ్.. వివేక్ ఓబెరాయ్‌కు మతి చెడింది.. ఊర్మిళ

Webdunia
మంగళవారం, 21 మే 2019 (09:32 IST)
బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్‌కు మతి చెడిందని ముంబై నార్త్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న నటి ఊర్మిళ మండిపడ్డారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో తొంగిచూసే బుద్ధి ఏమాత్రం మంచిది కాదంటూ వివేక్‌ ఓబెరాయ్‌కు కడిగిపారేసింది.
 
పీఎం నరేంద్ర మోడీ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్న నటుడు వివేక్ ఓబెరాయ్. నిజానికి గత కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో పీఎం నరేంద్ర మోడీ చిత్రంతో ప్రేక్షకుల మందుకు వస్తున్నాడు. పైగా, నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మంచి పబ్లిసిటీ కొట్టేస్తున్నాడు. 
 
ఎగ్జిట్‌ పోల్స్‌ నేపథ్యంతో బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌ - హీరో సల్మాన్ ఖాన్‌లపై ఓ నెటిజన్‌ రూపొందించిన మీమ్‌ను వివేక్‌ ట్వీట్‌ చేశాడు. దానికి కింద 'హాహా... క్రియేటివ్స్... నో పాలిటిక్స్... జస్ట్ లైఫ్!' అని రాశారు. ఈ పోస్టు చేసిన వివేక్‌పై పలువురు నటులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని తీరుపై మండిపడుతున్నారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, క్రీడాకారిణి గుత్తా జ్వాల, ఇపుడు ఊర్మిళలు వివేక్‌పై మండిపడ్డారు.
 
'ఇది ఎంతో నీచం. ఇది చాలా చెడ్డ పని. వివేక్ ఓబెరాయ్ చాలా అనుచితమైన పోస్టు చేశారు. మీరు ఒక మహిళను లేదా చిన్న పిల్లను క్షమాపణలు అడగలేకపోయిన పక్షంలో, కనీసం ఆ పోస్టును తొలగించి, గౌరవం నిలబెట్టుకోండి' అని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎంఐఎం గెలుపు

పరువు నష్టం దావా కేసులో మేధా పాట్కర్ అరెస్టు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments