Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ అనేది రెండు మనసుల కలయిక.. అది రెండువైపులా ఉండాలి : ఊర్వశీ రౌతేలా

ఠాగూర్
ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (09:42 IST)
ప్రేమ అనేది రెండు మనసుల కలయిక అని అది రెండు వైపులా ఉండాలి అని హీరోయిన్ ఊర్వశీ రౌతేలా చెప్పారు. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి, వివాహ బంధంపై స్పందించారు. 'ప్రేమ అనేది ఓ రెండు మనసుల కలయిక. అది రెండు వైపుల ఉండాలి. ఇద్దరు వ్యక్తులు పూర్తి అంగీకారంతోనే వివాహబంధంలోకి అడుగుపెట్టాలి. ఎదుటి వ్యక్తిపై నమ్మకం, గౌరవం ఎంతో ఇందులో ఎంతో ముఖ్యం. వివాహ వ్యవస్థపై ఉన్న నమ్మకంతోనే జీవితాంతం కలిసి నడుస్తూ మనం బాధ్యతలు నిర్వర్తించాలి' అని ఊర్వశీ పేర్కొంది. 
 
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించిన తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన ఊర్వశి... ఆ తర్వాత నుంచి పలు సాంగ్స్​లో మెరిసి ఇక్కడి ఆడియెన్స్​కు చేరువైంది. ఇటీవలే "బ్రో" సినిమాలో మెరిసింది. రామ్‌ బోయపాటి కాంబోలో వచ్చిన 'స్కంద'తో పాటు అక్కినేని అఖిల్‌ 'ఏజెంట్‌', సినిమాల్లోనూ కనిపించింది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హీరోగా రానున్న "ఎన్​బీకే 109"లో ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది.
 
గత 2013లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఊర్వశి కెరీర్​లో ఒకే ఒక్క హిట్ ఉంది. తను నటించిన తొలి చిత్రం నుంచి ఇప్పటివరకు అన్నీ ప్లాప్ చిత్రాలే కానీ, సీనియర్ హీరో పక్కన నటించే సత్తా ఉన్న నటిగా గుర్తింపు ఉండటంతో రూ.300 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది ఊర్వశి. 15 ఏళ్ల వయసులో తన ఫ్యాషన్ జర్నీని ప్రారంభించిన ఊర్వశి మిస్ టీన్ ఇండియాగా 2009లో ఎంపికైంది. 
 
బ్యూటీ క్వీన్, ఇండియన్ ప్రిన్సెస్ 2011, మిస్ ఏషియన్ సూపర్ మోడల్ 2011, మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ 2011 వంటి టైటిల్స్ గెలుచుకుంది. 2013లో సన్నీ దేవోల్​ పక్కన సింగ్ సాహిబ్ ది గ్రేట్ చిత్రంలో నటించడం ద్వారా తెరగేట్రం చేసిన ఊర్వశి నటిగా ఎక్కువ ప్లాప్ చిత్రాలతో చెత్త రికార్డు మూటగట్టుకుంది. కానీ, హనీసింగ్ మ్యూజిక్ ఆల్బమ్ లవ్ డోస్​లో తన డ్యాన్స్ ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పన్న చందనోత్సవ వేడుక విషాదం .. గాలివానకు గోడ కూలింది.. 8 మంది మృతి!!

భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

Sailajanath: వైకాపా సింగనమల అసెంబ్లీ సమన్వయకర్తగా సాకే శైలజానాథ్

అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments