Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' ఫస్ట్ లుక్ విడుదల, ఏప్రిల్ 2 సినిమా విడుదల

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (21:48 IST)
సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదలయింది. ఆ పోస్టర్లో కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ ధరించి ఉన్న వైష్ణవ్ తేజ్ సముద్రం వైపు చేతులు చాపి బిగ్గరగా కేక వేస్తూ కనిపిస్తున్నాడు.
 
తొలి సినిమా కోసమే తన శరీరాకృతిని మార్చుకున్న అతను చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. పోస్టర్లో అతని బాడీ లాంగ్వేజ్ లోని టెంపరమెంట్, సముద్రం.. సినిమా టైటిల్‌కు యాప్ట్ అనిపిస్తున్నాయి.
 
వచ్చే వేసవిలో ఏప్రిల్ 2న మూవీని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. 
లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సాన 'ఉప్పెన'తో దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాతో కృతి శెట్టి నాయికగా టాలీవుడ్లో అడుగుపెడుతుండగా, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక ప్రధాన పాత్ర చేస్తున్నారు.
 
'రాక్ స్టార్' దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.  సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ 'ఉప్పెన'ను నిర్మిస్తోంది. 
 
తారాగణం: పంజా విష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ. సాంకేతిక వర్గం:
కథ, దర్శకత్వం: బుచ్చిబాబు సాన
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ వై.
సీఈవో: చెర్రీ, 
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, 
సినిమాటోగ్రఫీ: శాందత్ సైనుద్దీన్, 
మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్,
ఎడిటర్: నవీన్ నూలి
, ఆర్ట్ డైరెక్టర్: మౌనిక, రామకృష్ణ, 
పీఆర్వో: వంశీ-శేఖర్, మధు మడూరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments