Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు బావా.. చైతూకి ఆశ్రిత విషెస్

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (20:14 IST)
సమంతతో విడిపోయాక నాగచైతన్య సినిమాలు, వెబ్ సిరీస్, వ్యాపారాలంటూ బిజీగా వున్నాడు. గత ఏడాది లవ్ స్టోరీ చిత్రంతో ప్రేక్షకులని అలరించిన నాగ చైతన్య ఈ ఏడాది సంక్రాంతికి తండ్రి నాగార్జునతో కలిసి నటించిన బంగార్రాజు సినిమాతో వరుసగా సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
 
అలాగే దిల్ రాజు నిర్మాణంలో విక్రం కె కుమార్ దర్శకత్వంలో చైతు-రాశిఖన్నా జంటగా నటించిన 'థాంక్యూ' సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.
 
అలాగే, బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రం సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. మరి కొన్ని ప్రాజెక్టులు కూడా చైతూ ఖాతాలో ఉన్నాయి. ఇలా పరిస్థితుల్లో సమంతకు దూరమై క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. 
 
గ్యాప్‌లో చైతన్య హైదరాబాద్‌లో 'సోయు' కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్ పెట్టి తెలిపారు. ఇది చూసిన విక్టరీ వెంకటేశ్ కూతురు ఆశ్రిత ..'ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు బావా' అంటూ చైతూ పెట్టిన పోస్ట్‌కు రిప్లై ఇస్తూ విషెస్ తెలిపింది. ఇక నాగ చైతన్య అభిమానులు ఈ సందర్భంగా విషెస్ తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments