Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రనటుడు గిరీశ్ కర్నాడ్ కన్నుమూత

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (10:41 IST)
దక్షిణాది అగ్రనటుడు గిరీశ్ కర్నాడ్ తుదిశ్వాస విడిచారు. బెంగళూరులో సోమవారం ఉదయం 6.30 గంటలకు కన్నుమూశారు. 81 సంవత్సరాల వయస్సులో అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారని ఆయన కుటుంబీకులు వెల్లడించారు. 
 
తెలుగులో గిరీశ్ కర్నాడ్ ధర్మచక్రం, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, ప్రేమికుడు, ఆనంద భైరవి, రక్షకుడు తదితర చిత్రాల్లో నటించారు. 1972లో గిరీశ్ కర్నాడ్ కు బీవీ కారంత్ తో కలిపి 'వంశ వృక్ష' అనే కన్నడ చిత్రానికి ఉత్తమ దర్శకునిగా జాతీయ అవార్డు లభించింది. 
 
మహారాష్ట్రలోని మాతేరన్‌లో 1938 మే 19న జన్మించిన గిరీశ్ కర్నాడ్, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. పరిస్థితి విషమించి సోమవారం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 
 
చివరిగా ఆయన సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ జిందా హై' చిత్రంలో రా చీఫ్‌గా నటించారు. గిరీశ్ కర్నాడ్ మృతిపై దక్షిణాది చిత్ర పరిశ్రమలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. పలువురు ఆయన మృతిపట్ల ఆయన కుటుంబీకులకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments