Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ కు దగ్గరగా వస్తున్న విజయ్ దేవరకొండ ఫాలోవర్స్

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (08:27 IST)
Vijay-Bramhanandam
ఇన్ స్ట్రా లో  20 మిలియన్ ఫాలోవర్స్ కు చేరుకున్నట్లు విజయ్ దేవరకొండ-కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని పంచుకున్నాడు. గీతా గోవిందం తర్వాత పెద్దగా హిట్ లేని విజయ్ దేవరకొండకు ఇంత ఫాలోయింగ్ రావడం విశేషమే. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫాలోవర్స్ 22.9 మిలియన్లు అంటే 23 దాకా చేరుకున్నారు. పుష్ప తర్వాత ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగింది. ఇక ఇప్పుడు పుష్ప2 షూటింగ్ జరుగుతోంది.
 
Vijay Devarakonda
ఇక విజయ్ దేవరకొండ విషయంలో అలా లేదు. తాజాగా విజయ్ దేవరకొండ,సమంత జంటగా నటించిన ఖుషి చిత్రం మిక్స్ డ్ టాక్ తో నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. ఇంతకు ముందు  లైగర్, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు ఘోరపరాజయం పొందాయి. అయినా తన అభిమానులకు సేవా కార్యక్రమాల రూపంలో కోటి రూపాయలు అందజేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వస్తే పట్టించుకోలేదని టాక్ వుంది.
 
ఇక లేటెస్ట్ గా నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ అనే సినిమాను విజయ్ తో నిర్మిస్తున్నారు. ఇటీవలే సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా వచ్చింది. ఈ సినిమాపై అటు నిర్మాత, హీరో కూడా విశ్వాసంతో వున్నారు. అభిమానులు కూడా ఆయన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments