Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాఠీ కోసం హైద‌రాబాద్ వ‌స్తున్న విశాల్‌

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (17:54 IST)
Vishal, Laatti movie
యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం ఏ వినోద్ కుమార్‌ దర్వకత్వంలో లాఠీ అనే సినిమాను చేస్తున్నారు. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ తాజాగా పూర్తయింది. ఈ సందర్బంగా మేకర్లు ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో విశాల్ మీసం కట్టుతో కనిపించారు.  
 
రెండో షెడ్యూల్ చివరి రోజంతా చిత్రయూనిట్ పని చేసింది. ఇక ఇప్పుడు యూనిట్ అంతా కూడా మూడో షెడ్యూల్ కోసం హైద్రాబాద్‌కు చేరుకుంది. ఇండియన్ టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో నలభై రోజుల పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కించనున్నారు.
 
‘లాఠీ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ పూర్తయింది. చివరి రోజున విశ్రాంతి అనేది లేకుండా 24 గంటలు పని చేశామంటే నమ్మకశక్యంగా లేదు.. పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో టీం అంతా కలిసి మూడో షెడ్యూల్ కోసం హైద్రాబాద్‌కు రాబోతోన్నాం’ అని విశాల్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు.
 
లాఠీ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను ఇది వరకే విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సమాజంలో భారీ మార్పును తీసుకొచ్చే శక్తివంతమైన కథను ఇందులో చూపించబోతోన్నారు. అన్ని భాషల్లోనూ లాఠీ అనే టైటిల్‌తో రిలీజ్ చేయబోతోన్నారు.
 
ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లో విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా నటించనున్నారు. రానా ప్రొడక్షన్స్‌లో రమణ, నందా కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
లాఠీలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయి. ద్వితీయార్థంలో ఉండే 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ అవ్వనుంది.
 
బాలసుబ్రమణ్యన్ కెమెరామెన్‌గా, పార్థిబన్ ఈ చిత్రానికి రచయితగా పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments